Controversial IAS Officers: వైరల్ అవుతోన్న డాగ్ వాక్ వివాదం…ఆమె అరుణాచల్ ప్రదేశ్..అతను లడఖ్..!!

త్యాగరాజస్టేడియంలో డాక్ వాక్ వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్ర హెం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 05:30 AM IST

త్యాగరాజస్టేడియంలో డాక్ వాక్ వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్ర హెం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేడియంలో సౌకర్యాలు దుర్వినియోగానికి సంబంధించి ఢిల్లీ సర్కార్ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ పై చర్యలు తీసుకుంది. ఐఏఎస్ సంజీవ్ ఖిర్వార్ ను ఢిల్లీ నుంచి లడఖ్ కు బదిలీ చేసింది. ఆయన భార్య ఐఎఎస్ అధికారిణి రింకు దుగ్గాను కూడా అరుణాచల్ ప్రదేశ్ కు కేంద్రహోంమంత్రిత్వ శాఖ బదిలీ చేసింది.

వివాదం ఏంటీ..?
ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ తన భార్య…తమ పెంపుడు కుక్కను తీసుకుని స్టేడియానికి సాయంత్రం వాక్ వెళ్లారు. ఇలా చేయడం వల్ల గతంలో రాత్రి 8 లేదా 8:30గంటల వరకు శిక్షణ తీసుకునే అథ్లెట్లు వారి వ్యవహారంతో సాయంత్రం 7గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్టేడియం సిబ్బంది క్రీడాకారులను ఆదేశించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖిర్వార్ ఖండించారు. తన వాక్ అథ్లెట్స్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించదన్నాడు. స్డేడియం అడ్మినిస్ట్రేటర్ అనిల్ చౌదరి కూడా ఆరోపణలను ఖండించారు.

ఈ విషయం కాస్త వెలుగులోకి రావడంతో ఢిల్లీలోకి కేజ్రీవాల్ సర్కార్ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడాకారుల కోసంస్టేడియాలు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారిక సమయాలను అనుసరిస్తున్నారని తెలిపారు. అథ్లెట్లకు అధికారిక శిక్షణ సమయం రాత్రి 7 గంటల వరకు ఉంటుందన్నారు. ఆ తర్వాత, కోచ్, అథ్లెట్ వెళ్లిపోతారు. తొందరగా వెళ్లిపోవాలని ఎవ్వరూ కోరలేదు. కాగా
ఈ స్టేడియం 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించబడిన సంగతి తెలిసిందే.. ఈ క్రీడా సముదాయం అనేక సౌకర్యాలతో కూడినది. జాతీయ, రాష్ట్ర అథ్లెట్లు, పుట్‌బాల్ క్రీడాకారులు ఇక్కడ శిక్షణ సాధన చేస్తుంటారు.