Site icon HashtagU Telugu

Jagga Reddy: ప్రజాతీర్పును గౌరవిస్తా.. ఓటమిపై జగ్గారెడ్డి రియాక్షన్

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ అనగానే జగ్గారెడ్డి లాంటి నేతలు గుర్తుకు రావడం సహజం. కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్అయిన జగ్గారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలనే సీఎం రేసులో ఉన్నానని తేల్చి చెప్పిన ఆయన ఓటమిపాలు కావడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటమిపై మాట్లాడారు. ‘‘సంగారెడ్డి ప్రజలు నాకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారు. జగ్గారెడ్డినాకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే నాకు ఓట్లు వేయని 71వేల మందికి కృతజ్ఞతలు తెలిపారు  జగ్గారెడ్డి. సంగారెడ్డి ప్రజలు నాకు కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అలాగే 2004, 2009 లో ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇచ్చారు.

2014 లో ఓడించారు మళ్ళీ 2018 లో ఎమ్మెల్యే గా గెలిపించారు. కానీ ప్రభుత్వం రాలేదు .2023 అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను ఓడించారు. మీ తీర్పు ని గౌరవిస్తున్నా, స్వాగతిస్తున్నా..మీకు 24 గంటలో అందుబాటులో ఉండే వారిని ఎమ్మెల్యే గా గెలిపించుకున్నారు. ఆ ఎమ్మెల్యే తో పని చేయించుకోండి. నేను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ చెప్పిన 6 గ్యారెంటీ స్కీం లు సంగారెడ్డి లో ప్రజలకు అమలు అవుతాయి’’ అంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికి సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు సార్లు గెలిచిన జగ్గారెడ్డి నాలుగోసారి కూడా విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. సంగారెడ్డి లో ఇక తిరుగులేదని భావించారు. అందులో కాంగ్రెస్ వేవ్ ఉండటంతో తన గెలుపునకు ఇక ఢోకా ఉండదని కూడా నిర్ణయించుకున్నారు. అయితే జగ్గారెడ్డి జాతకం తిరగబడింది. ఆయన ఓటమి పాలు అయ్యారు.