Nara Lokesh : మంగళగిరి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తా – మంత్రి నారా లోకేశ్

Nara Lokesh : మంగళగిరి అభివృద్ధి కోసం కేంద్రమంత్రులతో చర్చలు జరిపి, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ (Nara Lokesh) మంగళగిరి నియోజకవర్గ (Mangalagiri Constituency) ప్రజలకు అభివృద్ధి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధిక మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలోనే అత్యధిక మెజారిటీ వచ్చినట్టు తెలిపారు. ప్రజలు తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కష్టపడతామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Mangaluru : ప్రాణాలు తీసేవరకు వెళ్లిన పగ

ఇక మంగళగిరి అభివృద్ధి కోసం కేంద్రమంత్రులతో చర్చలు జరిపి, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, ఈ కార్పొరేషన్‌ ద్వారా ఆ వర్గ ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు సహాయపడతామని తెలిపారు. ఇదే కాకుండా ప్రభుత్వం బడ్జెట్‌లో కూడా మంగళగిరి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించిందని వివరించారు.

MLC Elections : చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు : నాగబాబు

కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిందని, మంగళగిరిలో వాటిని వేగంగా అమలు చేస్తామని నారా లోకేశ్ అన్నారు. రోడ్లు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని, మంగళగిరిని అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

  Last Updated: 14 Mar 2025, 01:59 PM IST