Shock in Chennai: చెన్నైలో దారుణం.. ఐటీ ఉద్యోగిని దహనం

చెన్నైలో ఐటీ మహిళా ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వివరాలలోకి వెళితే..

Published By: HashtagU Telugu Desk
Shock in Chennai

Shock in Chennai

Shock in Chennai: చెన్నైలో ఐటీ మహిళా ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వివరాలలోకి వెళితే..

చెంగల్పట్టు జిల్లాలోని వేదగిరి పట్టణంలో ఓ యువతిని కిరాతకంగా దహనం చేసినట్లు దల్హంపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణాలతో పోరాడుతున్న మహిళను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సోదాలు నిర్వహించి ఘటనా స్థలంలో లభించిన సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. మదురైకి చెందిన నందిని(28) ఐటీ ఉద్యోగి అని పోలీసుల విచారణలో తేలింది.

నిన్న నందిని పుట్టిన రోజు కావడంతో ఆమె మాజీ ప్రియుడు బర్త్ డే సర్ ప్రైజ్ ఇస్తాను అని చేస్ప్పి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అయితే నందిని ప్రేమించిన వ్యక్తి థర్డ్ జెండర్ అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీంతో మరో ఆమె యువకుడితో ప్రేమాయణం ప్రారంభించింది. ఈ విషయం తెలిసి వెట్రి ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం వెట్రి పరారీలో ఉన్నాడు.

Also Read: Salaar Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద సలార్ సునామి.. 2 రోజుల్లో 300 కోట్లు

  Last Updated: 24 Dec 2023, 03:20 PM IST