Site icon HashtagU Telugu

KTR: సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు: కేటీఆర్

KT Rama Rao

Telangana Minister KTR America Tour

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎండ్ కార్డ్ పడిందనుకుంటున్న సమయంలో మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ గతంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ (KTR)పై ఆరోపణలు చేసినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నేరస్తుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయి. సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదు.

సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటాను. సుకేష్ లాంటి నేరస్తుడు మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి’’ అంటూ మీడియాకు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: Rajasingh meets Harish Rao: హరీశ్ రావుతో రాజాసింగ్ భేటీ.. పార్టీ మార్పుపై రూమర్స్!