Site icon HashtagU Telugu

Varun Tej: సోషల్ మీడియాలో నా వ్యక్తిగత విషయాలేవీ పంచుకోను: వరుణ్ తేజ్

Varun Tej

Varun Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా కో స్టార్ లావణ్య తో ప్రేమ నడిపినప్పటికీ సరైన సమయంలోనే బయటపెట్టాడు. తాజాగా ఈ హీరో తనకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించాడు. ‘‘నేను ప్రైవేట్ పర్సన్‌ని. వ్యక్తిగత విషయాలు బయటి వాళ్లకు తెలియకూడదు అనుకుంటాను. అందుకే సోషల్ మీడియాలో నా వ్యక్తిగత విషయాలేవీ పంచుకోను. అందుకే లావణ్యతో నా రిలేషన్‌షిప్‌ గురించి ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.

నిశ్చితార్థం అయినపుడు మాత్రమే అధికారికంగా ఫొటోలు రిలీజ్ చేశాను. లావణ్యతో ‘మిస్టర్’ టైంలో బాగా పరిచయం ఏర్పడింది. అప్పటికి తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. మా ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. జీవిత భాగస్వామి ముందు మనకు మంచి ఫ్రెండ్‌గా ఉండాలి అనుకుంటాను. లావణ్య అలాంటి వ్యక్తే. మేమిద్దరం వ్యక్తిగత, వృత్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడుకోగలం. ‘అంతరిక్షం’ సినిమా కంటే మేమిద్దరం రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకోగలం అనుకున్నాక పెద్దవాళ్లకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాం. ఈ ఏడాది చివర్లో మా పెళ్లి ఉంటుంది’’ అని చెప్పాడు.

Also Read: Rinku Singh: నా కుటుంబానికి మంచి జీవితాన్ని అందిస్తా: రింకు సింగ్

Exit mobile version