Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు!

 తాను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
KCR Before

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy: తాను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని, నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన శాసన మండలి ఛైర్మన్ పదవీలో ఉన్నా.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. చట్టబద్ధంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. మా సంపూర్ణ సహకారం ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు.

కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా సాధ్య అసాధ్యలను బేరీజు వేసుకోవాలని, ప్రజలకు వాస్తవ పరిస్థితి వివరించి పథకాలు అమలు చేయాలి. వాస్తవం చెబితే ప్రజలు తప్పకుండా అర్ధం చేసుకొంటారని ఆయన సూచనలు చేశారు. బిఆర్ యస్ పార్టీ అధిష్టానం కూడా ఎందుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చారు అనేది విశ్లేషన చేసుకొంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన పట్ల ప్రజలకు ప్రేమ ,విశ్వాసం అలాగే ఉన్నాయన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే మళ్ళీ బి ఆర్ యస్ పార్టీనే అధికారంలోకి వచ్చేదని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

  Last Updated: 11 Dec 2023, 11:45 AM IST