Koppula: ప్రజల కోసం పనిచేసే నాయకుడ్ని నేను: కొప్పుల ఈశ్వర్

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 06:23 PM IST

Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట 1 ఇన్ క్లైన్, 2 ఇన్ క్లైన్ మైనింగ్ లో సింగరేణి ఘని కార్మికులను కలిసి, పార్లమెంట్ అభ్యర్థిగా ఓ సింగరేణి కార్మిక బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి కెసిఆర్ అవకాశం కల్పించారని, నేను సాదాసీదా మనిషిని, ప్రజల మధ్యలో ఉన్న నాయకున్ని, పిలిస్తే పలికే నాయకున్ని, ప్రజల కోసం పనిచేసే నాయకున్ని అని అన్నారు.

‘‘నేను ఈ ప్రాంతానికి చెందిన వాన్ని నా కుటుంబం మొత్తం సింగరేణి కార్మికులే, తెలంగాణ ఉద్యమం పునాది నుండి తెలంగాణ లో పనిచేసాను, అనుభవం ఉన్న వ్యక్తిగా, ఈ ప్రాంతానికి పరిచయం ఉన్న వ్యక్తిగా అన్ని వర్గాల సమస్యలపై అనుభవం ఉన్న వ్యక్తిగా నేను ఉంటే బాగుంటుందని కెసిఆర్ గారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎంపి గా గెలిచిన వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే’’ అని కొప్పుల అన్నారు.

‘‘మొదటి సారి గా 26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఈ ప్రాంత వ్యక్తి గా అవకాశం కల్పించినట్లైతే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కావచ్చు, సమస్యలపై పోరాడే అవకాశం ఉంటుంది. బిజెపి కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ఒక కుట్రలు, జరుగుతుందని, ఈ విషయాన్ని ఈ మధ్య కెసీఆర్ పర్యవేక్షణలో వివరించారని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు’’ అని కొప్పుల పేర్కొన్నారు.