విశ్వం గుట్టు చెప్పిన గులకరాయి..మీరు చూసారా ఈ రాయిని ?

మాములుగా తీగ లాగితే డొంకతా కదిలినట్టు అనే సామెతను చెబుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈజిప్టులో లభించిన ఒక గులకరాయి విశ్వంలో చోటుచేసుకున్న ఒక భారీ పేలుడుకు సంబంధించిన రహస్యాలను బయటపడుతోంది. కానీ ఈ గులకరాయి అసలు మన సౌరవ్యవస్థకు చెందినదే కాదని,మన సౌరవ్యవస్థ పురుడు పోసుకోవడానికి ముందే ఇది ఏర్పడిందని పరిశోధకులు కచ్చితమైన నిర్ధారణకు రావడం జరిగింది. ఈజిప్ట్ లోని నైరుతి భాగంలో లభించిన ఈ గులకరాయి జొహన్నెస్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ […]

Published By: HashtagU Telugu Desk
Ibpamryd

Ibpamryd

మాములుగా తీగ లాగితే డొంకతా కదిలినట్టు అనే సామెతను చెబుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈజిప్టులో లభించిన ఒక గులకరాయి విశ్వంలో చోటుచేసుకున్న ఒక భారీ పేలుడుకు సంబంధించిన రహస్యాలను బయటపడుతోంది. కానీ ఈ గులకరాయి అసలు మన సౌరవ్యవస్థకు చెందినదే కాదని,మన సౌరవ్యవస్థ పురుడు పోసుకోవడానికి ముందే ఇది ఏర్పడిందని పరిశోధకులు కచ్చితమైన నిర్ధారణకు రావడం జరిగింది. ఈజిప్ట్ లోని నైరుతి భాగంలో లభించిన ఈ గులకరాయి జొహన్నెస్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు విభిన్నంగా కనపడుతూ వారిలో ఆసక్తి రేకెత్తించింది. అయితే ఆ గులకరాయి భూగ్రహానికి చెందిన కాదని, 2013లో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత రెండేళ్లకు ఇది కనీసం ఇప్పటివరకు అవగాహన ఉన్న ఉల్క లేదా తోకచుక్కలకు కూడా చెందినది కాదని నిర్ధారించగా తాజాగా ఇప్పుడు ఈ రాయి హైపాటియా అనే శిలకు చెందినదని, మన సౌరవ్యవస్థ ఆవల సంభవించిన సూపర్నోవా మాదిరి భారీ పేలుడు కారణంగా ఇది ఏర్పడిందని నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు. ఆ గులకరాయి కథ విషయానికి వస్తే సూర్యుడి కంటె అయిదు రెట్లు అధికంగా ద్రవ్యరాశి ఉండే ఓ అంతరిస్తున్న నక్షత్రం కారణంగా కొన్ని వేల సంవత్సరాల కిందట ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ అనంత విశ్వంలో చోటుచేసుకున్న భారీ పేలుళ్లలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.

అయితే ఈ విస్ఫోటనం సద్దుమణిగిన తరువాత పేలుడు కారణంగా వెలువడిన గ్యాస్‌ అణువులు సమీపంలోని ధూళి కణాలకు అతుక్కోవడం ప్రారంభించాయి. మిలియన్ల సంవత్సరాల తర్వాత, మన సౌరవ్యవస్థ ఉద్భవించడానికి ముందు ఇవి హైపాటియా శిలగా మారాయి. కాలక్రమంలో ఈ మాతృశిల భూమివైపు దూసుకెళ్లడం ఆరంభించింది. భూ వాతావరణంలో దీని ప్రవేశ తాపానికి నైరుతి ఈజిప్ట్‌లోని ద గ్రేట్‌ శాండ్‌ సీ ఒత్తిడి ప్రభావం తోడై ఈ శిల విచ్ఛిన్నానికి, సూక్ష్మ పరిమాణంలో వజ్రాలు ఉద్భవించడానికి దారితీసింది. అలా అలా భూమికి చేరిన ఈ హైపాటియా రాయిలో మన సౌరవ్యవస్థలో ఇప్పటివరకూ ఏ పదార్థంలోనూ కనిపించని నికెల్‌ ఫాస్పైడ్‌ను కనుగొన్నారు. ప్రోటాన్‌ మైక్రోప్రోబ్‌ను ఉపయోగించి, ఈ రాయిలో 15 రకాల విభిన్న మూలకాలు ఉన్నట్టు అత్యంత కచ్చితత్వంతో గుర్తించాను అని జొహన్నెస్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జాన్‌ క్రామెర్స్‌ వెల్లడించారు.

  Last Updated: 15 Jun 2022, 05:59 PM IST