Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ ఒక్కసారిగా మారిన వాతావరణం, కారణమిదే

Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలుల తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.

ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో దక్షిణ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.8 డిగ్రీలుగా నమోదైంది. 47 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.ఉత్తర ఛత్తీస్ గఢ్ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు గల ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్ గఢ్, తెలంగాణ, కర్ణాటక మీదుగా అంతర్గత ఒడిశా నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపారు.ఈ ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

Exit mobile version