ప్రస్తుతం బిజీ లైఫ్ లో చాలామంది ఇంట్లో వంట చేయడమే మానేశారు. కొంతమంది టైం లేక చేయకుండా ఉంటె..మరికొంతమంది బయట ఫుడ్ కు అలవాటు పడి చేయడం లేదు. ఇంకొంతమందైతే పెరిగిన ధరలు పెట్టి కూరగాయలు కొని వంట చేయడం కంటే..బయట హోటల్స్ లలో తినడమే బెటర్ అని ఆలోచిస్తూ తినేస్తున్నారు. ఇలా రోజు రోజుకు తినేవారు ఎక్కువైపోతుండడం తో పెద్ద ఎత్తున రెస్టారెంట్ లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో అయితే చెప్పాల్సిన పనిలేదు.
హైదరాబాద్ నగరవాసులు ఎంత బిజీ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాలా..? లేసింది మొదలు..పడుకునేవరకు కూడా బిజీ బిజీగా గడుపుతుంటారు. కనీసం ఇంట్లో వారితో కూడా మాట్లాడలేనంత బిజీ గా ఉంటారు. ఈ సమయంలో ఇంట్లో వంట చేసుకొని , ప్రశాంతంగా తింటారా చెప్పండి. రోడ్ పక్కన ఏది కనిపిస్తే అది తిని ఆకలి తీర్చుకుందామని చూస్తారు. అందుకే రోడ్ల పక్కనే కాకుండా రకరకాల పేర్లతో రెస్టారెంట్ లు కనిపిస్తుంటాయి. తాజాగా ఇప్పుడు ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ పేరుతో సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని రైల్వేస్టేషన్ ఆవరణలో ఈ రైలు రెస్టారెంట్ (Rail Coach Restaurant) ను ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. సరికొత్త పద్ధతిలో భోజన ప్రియులకు ప్రత్యేకమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధమైంది. వినియోగంలో లేని పాత బోగీని రెస్టారెంట్ తరహాలో ఆధునికీకరించారు. కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా అన్ని హంగులతో రెస్టారెంట్‌లా తీర్చిదిద్దారు. చూసేందుకు మాత్రమే కాదు… రుచుల విషయంలోనూ తగ్గేదెలా అంటుంది ఈ రైల్ కోచ్ రెస్టారెంట్.
Read Also : Virat Kohli: 15 గంటల వ్యవధిలో రెండో మ్యాచ్.. అలసిపోయానంటూ కోహ్లీ కామెంట్..!
ఈ రెస్టారెంట్ మెనూ (Rail Coach Restaurant Menu)లో పసందైన వంటకాలు ఎన్నో ఉన్నాయని చెపుతుంది. నగరానికి చెందిన బూమరాంగ్ రెస్టారెంట్‌కు ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రైల్ కోచ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన వారికి.. పసందైన ఫుడ్ తో పాటు ప్రత్యేకమైన అనుభావాలను కూడా అందించబోతుంది. ఇది హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రెండో రెస్టారెంట్. కాచిగూడ రైల్వేస్టేషన్‌లోనూ ఇంతకుముందు ఓ రెస్టారెంట్ ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. దీనికి మంచి ఆదరణ రావడం తో.. ఇప్పుడు నెక్లెస్‌రెడ్‌లో రైల్ కోచ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేసింది. మీరు కూడా ఈ రెస్టారెంట్ కు వెళ్లి ఆహా అనిపించే భోజనం చెయ్యండి.