Site icon HashtagU Telugu

Numaish Closed: కరోనా ఎఫెక్ట్.. నుమాయిష్ బంద్!

Numaish

Numaish

దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ అధికారులు నుమాయిష్ లో ఏర్పాటైన అన్నీ స్టాళ్లను సమాచారం అందించి వెంటనే మూసివేయించారు. కరోనా కేసులు కట్టడి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా నుమాయిష్ ఫస్ట్ రోజున జనం తక్కవ మంది రాగా, రెండరోజు పదివేల మంది విజిట్ చేసినట్టు తెలుస్తోంది.