Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలను నమ్మి కుటుంబం గురించే ఆలోచించడమే ఇందుకు కారణం. అని ఆయ‌న అన్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Raghubar Das July1 Imresizer

Raghubar Das July1 Imresizer

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలను నమ్మి కుటుంబం గురించే ఆలోచించడమే ఇందుకు కారణం. అని ఆయ‌న అన్నారు. కేసీఆర్ తెలంగాణ‌ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని.. కాబట్టి ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. రఘుబర్ దాస్ శుక్రవారం హైదరాబాద్‌లోని చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు.

  Last Updated: 01 Jul 2022, 10:29 PM IST