Site icon HashtagU Telugu

SRH Victory: సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో… వరుసగా నాలుగో విజయం

SRH

SRH

ఐపీఎల్ 2022లో స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్ దుమ్మురేపుతోంది. సీజన్‌ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ఆ జట్టు… ఇప్పుడు పూర్తి ఫామ్‌లోకి వచ్చేసింది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటితే… బ్యాటింగ్‌లో మక్రరమ్, పూరన్, అభిషేక్ శర్మ రాణించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. లివింగ్ స్టోన్ తప్పిస్తే… మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భువనేశ్వర్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పాటు వరుస వికెట్లు పడగొడుతూ పంజాబ్‌ను నియంత్రించారు. లివింగ్ స్టోన్ బ్యాటింగ్ చూస్తే ఓ దశలో పంజాబ్ కింగ్స్ 180 పరుగుల పైనా స్కోర్ చేస్తుందనిపించింది. అయితే చివరి ఓవర్లలో సన్‌రైజర్స్ పేసర్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ చివ‌రి ఓవ‌ర్లో 3 వికెట్లు తీయ‌డంతోపాటు మొయిడెన్ చేసిన పంజాబ్‌ను దెబ్బ‌కొట్టాడు. ఆ ఓవ‌ర్లో ఓ ర‌నౌట్ కూడా వ‌చ్చింది. మొత్తంగా ఈ మ్యాచ్‌ల్లో 28 ప‌రుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్ల‌తో చెల‌రేగాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ కూడా 22 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీసి స‌త్తా చాట‌డంతో పంజాబ్ 151 పరుగులకే పరిమితమైంది. భువి, ఉమ్రాన్ ధాటికి చివ‌రి 4 ఓవ‌ర్ల‌లో పంజాబ్ 19 ప‌రుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది. మిగ‌తావారిలో షారూక్ ఖాన్ 26, ప్రభసిమ్రన్ 14, ఓడియ‌న్ స్మ‌త్ 13, బెయిర్‌స్టో 12, జితేష్ శ‌ర్మ 11, శిఖ‌ర్ ధావ‌న్ 8 ప‌రుగులు చేశారు.

https://twitter.com/ch__furqan/status/1515669426808717314152

ప‌రుగుల మోస్త‌రు ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ 3 రన్స్‌కే ఔటయ్యాడు. తర్వాత రాహుల్ త్రిపాఠీ, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఔటైయ్యేటప్పటికీ… స‌న్‌రైజ‌ర్స్ విజయం కోసం మ‌రో 57 బంతుల్లో 75 ప‌రుగులు చేయాల్సి ఉండడంతో ఆసక్తి నెలకొంది. అయితే నికోల‌స్ పూర‌న్, మక్రరమ్‌ పంజాబ్ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో పరుగుల రాబట్టారు. వరుస బౌండరీలతో చెలరేగిన వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి మరో ఓవ‌ర్ మిగిలి ఉండగానే స‌న్‌రైజ‌ర్స్ విజయాన్ని పూర్తి చేశారు. తాజా విజయంతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్ళింది.