Site icon HashtagU Telugu

Hyderabad: ఎంజీబీఎస్ లో ఇక టాయిలెట్లు ఉచితం

FREE BUS TRAVEL

తెలంగాణ ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. స్వచ్ఛ ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులోని ఎంజీబీఎస్ బస్టాండ్ లో మరుగుదొడ్ల వినియోగాన్ని ఉచితం చేసింది. ఇప్పటివరకు ఎంజీబీఎస్ లో మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగానికి రూ.5 నుంచి రూ.10 దాకా తీసుకునేవారు. ఇకపై ప్రయాణికులు ఎలాంటి రుసుము చెల్లించకుండానే వాటిని వినియోగించుకోవచ్చు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్టాండ్లలోనూ మరుగుదొడ్లు, మూత్రశాలల వినియోగాన్ని ఉచితం చేస్తామని తెలంగాణ ఆర్టీసీ అధికారవర్గాలు వెల్లడించాయి. లగేజీ , పిల్లలతో ఎంజీబీఎస్ బస్టాండ్ కు వచ్చే మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల ‘ బేబీ ట్రాలీ’ సర్వీస్ ను కూడా ప్రారంభించారు. వృద్దులను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలు కల్పించే దిశగానూ కసరత్తు చేస్తోంది.