Site icon HashtagU Telugu

Traffic Alert: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌: వార్-2 ఈవెంట్‌తో యూసుఫ్‌గూడలో రూట్‌ మార్పులు

War 2 Pre Release

War 2 Pre Release

హైదరాబాద్‌: (War 2 Pre Release) టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవ్వనుండటంతో, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో పోలీసులు యూసుఫ్‌గూడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులు కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.

వార్-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దేవర’ హిట్ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతుండటంతో ఫ్యాన్స్ లో క్రేజ్ పెరిగింది.