Site icon HashtagU Telugu

Tinted Glass: బ్లాక్‌ ఫిల్మ్ అద్దాల కార్లపై కొరడా

Tinted Glass

Tinted Glass

కార్లకు టింటెడ్‌ గ్లాస్‌ (బ్లాక్‌ ఫిలిం అతికించినవి), నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనాలు వాడుతున్నారా? గడువులోగా రిజిస్టర్‌ చేయించ కుండా టెంపరరీ రిజిస్ట్రేషన్‌ ఉన్న వాహనాలపై తిరుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త ! ఇలాంటి వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ఈ నెల 18 నుంచి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వెల్లడించారు. వాహనదారులు నిబంధనలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలతో పాటు నేరాలకూ ఆస్కారం కలుగుతోందని చెప్పారు.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాన్ని నడిపే వారితో పాటు వాహన యజమానిపై కూడా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కొత్త వాహనాలు కొనేవారు నెల రోజుల్లోగా పర్మినెంట్ నంబరును పొందాలని సూచించారు.