Hyderabad Zoo: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ‘సింహం’ దత్తత

గత ఏడాది కాలంగా జంతు ప్రేమికులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని జంతువులను దత్తత తీసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Tiger

Tiger

గత ఏడాది కాలంగా జంతు ప్రేమికులు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని జంతువులను దత్తత తీసుకుంటున్నారు. శుక్రవారం సిటీ చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ జూలో సాక్షి అనే ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నాడు. జంతుప్రదర్శనశాలను సందర్శించిన సందర్భంగా.. టెక్కీ సింహం ఖర్చుల కోసం  ఒక సంవత్సరం పాటు నిర్వహణ కోసం రూ.1 లక్ష చెక్కును అందించారు. వన్యప్రాణుల సంరక్షణలో తమ సహకారం అందించినందుకు ప్రదీప్, అతని కుటుంబ సభ్యులకు జూ అధికారులు ధన్యవాదాలు తెలిపారు

  Last Updated: 25 Feb 2022, 10:11 PM IST