Site icon HashtagU Telugu

Hyderabad: హైద‌రాబాద్‌లో స్నోవ‌రల్డ్ సీజ్‌.. కార‌ణం ఇదే..?

Snow World Hyderabad 665x445 Imresizer

Snow World Hyderabad 665x445 Imresizer

హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రం స్నో వ‌ర‌ల్డ్‌ను రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఏళ్ల త‌ర‌బ‌డి కార్య‌క‌లాపాలు సాగిస్తున్న స్నో వ‌ర‌ల్డ్ ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన రూ.16 కోట్ల‌ ప‌న్నును మాత్రం ఎగ‌వేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై స్నో వ‌రల్డ్ స‌హా ప‌న్ను బ‌కాయిలు ఉన్న ప‌ర్యాట‌క కేంద్రాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. ప్ర‌భుత్వం నుంచి జారీ అయిన నోటీసుల‌ను కూడా స్నో వ‌రల్డ్ ప‌ట్టించుకోలేదు. దీంతో గురువారం రంగంలోకి దిగిన ప‌ర్యాట‌క శాఖ అధికారులు స్నో వ‌ర‌ల్డ్‌ను సీజ్‌చేశారు. రాష్ట్రంలోని మ‌రో 16 ప‌ర్యాట‌క కేంద్రాలు ప‌న్ను బ‌కాయిలు ఉన్నాయ‌ని ప‌ర్యాట‌క శాఖ అధికారులు తెలిపారు. నిర్దేశించిన గ‌డువులోగా ఆ సంస్థ‌లు కూడా ప‌న్నులు క‌ట్ట‌క‌పోతే వాటిని కూడా సీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు