Site icon HashtagU Telugu

Hyderabad: బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తే అంతే: షీ టీమ్స్

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ నగరం దినదినాన అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుంది. దీంతో నగరంలో ఫారెన్ కల్చర్ పెరుగుతుంది. పార్క్స్, కొన్ని బహిరంగ ప్రదేశాలు లవర్స్ కి అడ్డాగా మారుతున్నాయి. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ తో రెచ్చిపోతున్నారు. ముద్దులతో ఇతరులకు ఇబ్బందిగా మారుతున్నారు. దీంతో షీ టీమ్స్ కు కంప్లైంట్స్ రావడంతో అధికారులు స్పందించారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేసి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

నగరంలో బహిరంగ ప్రదేశాల్లో కొందరు జంటలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరుపై హైదరాబాద్ పోలీసుల షీ టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అనుచిత ప్రవర్తనలకు పాల్పడినందుకు 12 మంది వ్యక్తులు వివిధ IPC సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించబడ్డారని పోలీసు పత్రికా ప్రకటన తెలిపింది.

ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.షీ టీమ్స్ సేకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Weather Forecast: రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు