Hyderabad: సంతాన లోపానికి కారణం ఎక్కువగా పురుషుల్లోని సమస్యలే..షాకింగ్ అధ్యయనం?

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 06:15 AM IST

చాలామందికి పెళ్లి అయ్యి కొన్ని ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలగకపోవడం అన్నవి చూస్తూ ఉంటాం. ఇలా పిల్లలు కలగకపోవడానికి పురుషులలో, లేదంటే స్త్రీలలో లోపాలు ఉంటాయి. అయితే మన దేశంలోని పురుషుల్లో సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏమీ లేదు ప్రత్యేక జన్యువులు ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు. పురుషుల్లో జరిగే 8 మార్పులు మార్పులు వీర్యం ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తాయట.

అలాగే పురుషుల్లో వంధ్యత్వానికి కూడా కారణం అవుతాయి అని తెలిపారు శాస్త్రవేత్తలు. సంతానం కలగకపోవడానికి ప్రధాన, అలాగే సగం కారణం పురుషుల్లోని సమస్యలే­నని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే పిల్లలు పుట్టకపోతే మహిళల­ను నిందించడం సరికాదని వారు స్పష్టం చేశారు. జన్యుమార్పులు వంధ్య­త్వానికి దారితీస్తున్నట్టు వెల్లడయ్యిందని, ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు వీలవుతుందని.

అయితే ఇదే విషయం గురించి చాలా రోజుల నుంచి పరిశోధనలు తెలపగా దేశంలోని పురుషుల్లో వంధ్యత్వ సమస్య లు ఉన్న పురుషులలో 38 శాతం మంది వై క్రోమోజోమ్ లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. దీనితోపాటు కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసోమల్‌ జన్యువుల్లో మార్పులు కూడా వంధ్యత్వానికి కారణమవుతున్నట్టు తేల్చారు. తాజా పరిశోధనలో భాగంగా తాము వంధ్యత్వ సమస్య ఉన్న 47మందిలోని జన్యుక్రమాన్ని పరిశీలించామని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. కాబట్టి సంతానం కలగలేదు అని అని భార్యలను నిందించే వారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలని కూడా వారు సూచించారు.