కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన జి. కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలికింది. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వ్హయించారు. రసూల్‌పురా, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్, ఆబిడ్స్ సర్కిల్, నాంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈ ర్యాలీ సాగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బీజేపీ తెలంగాణ యూనిట్ ఈ ర్యాలీ చేపట్టింది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 35 శాతానికిపైగా బీజేపీకి ఓట్లు వేశారని, ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రంలో భారీ కృతజ్ఞత సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.
ఇదిలా ఉంటె త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంచార్జీలను నియమించింది. జమ్ము కశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది. హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ కుమార్ దేవ్, మహారాష్ట్రకు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్, జార్ఖండ్‌కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మను ఇంచార్జీలుగా నియమించింది.
Read Also : India: మూడు దేశాలతో జరిగే టీమిండియా షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి షెడ్యూల్ ఇదే..