Site icon HashtagU Telugu

Covid-19: హైదరాబాద్ లో 100కు పైగా కోవిడ్ కొత్త కేసులు..!!

Corona New Variant

Corona New Variant

తెలంగాణలో కోవిడ్ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 15,200కోవిడ్ పరీక్షలు నిర్వహించగా…145మందికి పాజిటివ్ గా తేలింది. ఒక్క హైదరాబాద్ లోనే 117 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 75మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. కాగా తెలంగాణలో ఇప్పటివరకు 7,94,329 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగాజజజ7,89,241మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా 977మంది చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కోవిడ్ తో మరణించారు.