Site icon HashtagU Telugu

Hyderabad: ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందిన చంచల్‌గూడ ఖైదీ

Hyderabad

Hyderabad

Hyderabad: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నఅండర్ ట్రయల్ ఖైదీ మృతి చెందాడు. బాధితుడు ముదావత్ జాను (36)ని ఫిబ్రవరి 6న చంచల్‌గూడ సెంట్రల్ జైలులో రిమాండ్‌కు తరలించారు. దొంగతనం కేసులో పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌కు సంబంధించి రాజేంద్రనగర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదావత్ జాను ఆదివారం రాత్రి అనారోగ్యం కారణంగా జైలు సిబ్బంది అతడిని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా బాధితుడు తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతుడి జాను బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.జాను మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

Also Read: Comedians: ఒకే చోటు కలుసుకున్న ముగ్గురు స్టార్ కమెడియన్లు.. నెట్టింట ఫోటో వైరల్?