Site icon HashtagU Telugu

Gambling : హైదరాబాద్‌లో పేకాట స్ధావరాల‌పై పోలీసుల దాడులు.. ముగ్గురు అరెస్ట్‌

Crime

Crime

హైదరాబాద్‌లో పేకాట స్థావ‌రాల‌పై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో ముగ్గురు పేకాట‌రాయుళ్ల‌ను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14,830 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 28 ఏళ్ల హఫీజ్ అహ్మద్, జామియా ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌లపై నివసించే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. సమీపంలోని ఆటో స్టాండ్‌లోనే నిందితుడు జూదం నిర్వహించేవాడు. పక్కా సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాడి చేయగా అహ్మద్‌తో పాటు అతని కింది అధికారులు చింతల నర్సింగ్ (44), ఆటో డ్రైవర్‌, అహ్మద్‌ హుస్సేన్‌ (34)లు బస్‌ డ్రైవర్‌ ఉన్నట్లు గుర్తించారు.