Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hyderabad

New Web Story Copy 2023 07 08t194325.571

Hyderabad: హైదరాబాద్ పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొన్నాళ్లుగా నగరంలో గంజాయి కదలికలు లేనప్పటికీ వారం రోజులుగా మళ్ళీ గంజాయి పేరు వినిపిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా గంజాయి పట్టుబడుతోంది. ఈ రోజు శనివారం పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టుబడింది.

హైదరాబాద్ లోని నారాయణగూడ, లల్లాగూడలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. తనిఖీల్లో పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఒడిశాకు చెందిన ఎస్‌కే ధన్నా గంజాయి సరఫరా కోసం నారాయణగూడలోని మెల్‌కోట్ పార్కు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అతని సహచరులు షేక్ ఆసిఫ్ మరియు ఆరిఫ్ ఖాన్ గా గుర్తించారు పోలీసులు.

Read More: Selfie with YSR Statue: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ డిజిటల్‌ క్యాంపెయిన్‌కు భారీ స్పందన