Rave Party: హైద‌రాబాద్‌లో రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌పై పోలీసుల దాడి.. ప‌ట్టుబ‌డ్డ బ‌డాబాబుల పిల్ల‌లు

రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింగ్ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రైడ్ లో పోలీసులు పబ్ యజమానులతో సహా సుమారు 150మందిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్ కి తరలించినట్లు సమాచారం. రాత్రి3గం సమయంలో దాడులు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోగా పోలీసు స్టేషన్ లో యువకుల హంగామా చేసారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ ఆందోళన నిర్వహించారు.

ఈ రేవ్ పార్టీలో చాలా మంది హై ప్రొఫెషనల్స్ పిల్లలు బందువులు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన 150 మందిలో 39 మంది యువతులు ఉన్నారని, పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో బిగ్ బాస్ విజేత, పాప సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, ఒక మాజీ డిజిపి పిల్లలు, మాజి ఏమ్పిల పిల్లలు ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పబ్ కూడా పలుకుబడి ఉన్న రాజకీయనాయకుడి కుటుంబానికి సంబందించినది కాబట్టి ఈ కేసును పోలీసులు నిరు కార్చుతారనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.

ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ సిప్లిగంజ్ ని ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సుకు గెస్ట్ గా పిలిచారు. తెలంగాణ బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు యువమోర్చా ఉపాధ్యక్షుడు ఆశిష్ గౌడ్ నుండి భారీగా డ్రగ్స్ స్వాదినం చేసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసినవారిని విచారిస్తున్న పోలీసులు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లాడిస్తామని, ఈ కేసులో ఎంతటి పెద్దల హస్తమున్నా వదిలేప్రసక్తి లేదని పేర్కొన్నారు.