Site icon HashtagU Telugu

CP CV Anand : హైకోర్టు సీజేని క‌లిసిన హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్

Cv Anand

Cv Anand

హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. దాదాపు గంటపాటు వీరి సమావేశం జరిగింది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా కొనసాగుతున్న ఏర్పాట్లపై నగర పోలీసు చీఫ్ చీఫ్ జస్టిస్‌కు తెలియజేసినట్లు సమాచారం. GHMC లిమిట్స్‌లో 25 బేబీ పాండ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూలైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్)తో చేసిన గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో నిమజ్జనం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో సీపీ సీవీ ఆనంద్ హైకోర్టు సీజేతో స‌మావేశం అయ్యారు.