Hyderabad : పాత‌బ‌స్తీలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్ద‌రు అరెస్ట్‌

మీడియా రిపోర్టర్లుగా చెప్పుకుంటూ తిరుగున్న ఇద్ద‌రు వ్య‌క్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఓల్డ్ సిటీలో గంజాయి

Published By: HashtagU Telugu Desk
Ganja

Ganja

మీడియా రిపోర్టర్లుగా చెప్పుకుంటూ తిరుగున్న ఇద్ద‌రు వ్య‌క్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఓల్డ్ సిటీలో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై నగర పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి దాదాపు 20 గ్రాముల గంజాయి, నకిలీ ప్రెస్ ఐడెంటిటీ కార్డులు, కత్తులు, ద్విచక్రవాహనాన్ని భవానీ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులను అలందార్, మజర్‌లుగా గుర్తించారు. అలందార్, మజర్‌లు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌లో తిరుగుతూ వివిధ చోట్ల నుండి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి డ్రగ్స్ బానిసలకు విక్రయిస్తున్నారని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమ్జద్ ఖాన్ చెప్పారు. భవానీ నగర్ పోలీసులు వాహనాల తనిఖీ కోసం వారిని ఆపివేయగా, మీడియా రిపోర్టర్లుగా పరిచయం చేసుకొని తనిఖీలు చేయకుండా తప్పించుకున్నారు. నిందితులు ఇద్దరూ కూడా అర్థరాత్రి దుకాణాలు తెరిచి ఉంటే దుకాణదారులను బెదిరించి వారి నుండి డబ్బు వసూలు చేసేవారని తెలిపారు

  Last Updated: 20 Jan 2023, 06:02 PM IST