Site icon HashtagU Telugu

Hyderabad: కోరిక తీరుస్తావా ఫోటోలు పోస్ట్ చేయాలా అంటూ.. ప్రముఖ టీవీ యాంకర్ కు బెదిరింపులు?

Hyderabad

Hyderabad

సమాజంలో రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో కామాంధులు ఆడవారిపై ఏదో ఒక విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. రజక హైదరాబాదులో ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న ఒక యాంకర్ కు ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధురానగర్‌ లోని హాస్టల్‌ లో ఉంటున్న యువతి 27 ఏళ్ళ యువతి ఒక టీవీలో యాంకర్‌ గా పనిచేస్తోంది. ఆమె కళాశాలలో చదివే రోజుల్లో తోటి విద్యార్థి కూకట్‌ పల్లికి చెందిన కె.సామ్రాట్‌ అనే 30 ఏళ్ళ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సామ్రాట్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో అందుకు ఆ యువతి నిరాకరించింది. ఆ తర్వాత సామ్రాట్ స్నేహితుల్లా ఉందామని చెప్పడంతో అందుకు ఆ యువతి మొదట నిరాకరించిన ఆ తర్వాత సరే అని చెప్పింది. ఫ్రెండ్షిప్ అన్న ముసుగులోనే గతంలో ఒకసారి ఆ యువతీని కారులో ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన అతను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఆ సమయంలో అతని చర నుంచి తప్పించుకుంది.

దాంతో ఆ యువతి పట్ల పగ పెంచుకున్న సామ్రాట్ యువత చిత్రాలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసాడు. తన కోరిక తీర్చకపోతే ఆ మార్పింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తాను అంటూ సదరు యువతని వేధించడం మొదలుపెట్టాడు. సామ్రాట్ ఆగడాలు భరించలేకపోయిన సదరు యువతీ పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version