Site icon HashtagU Telugu

IPL Betting Case: ఐపీఎల్ బెట్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన గ్యాంగ్.. బేగం బ‌జార్‌లో ఇద్ద‌రు అరెస్ట్..!

Ipl Betting Hyderabad

Ipl Betting Hyderabad

క్రికెట్ ప్రేమికుల‌కు మ‌జాను పంచేందుకు ఈ ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) షురూ అయిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు ఐపీఎల్ అలా మొద‌లైందో లేదో, మ‌రోవైపు బెట్టింగ్ ముఠా రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో తాజాగా హైద‌రాబాద్‌లో ఓ బెట్టింగ్ ముఠాను న‌గ‌ర పోలీసులు ఎంతో చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. హైద‌రాబాద్‌లోని బేగంబ‌జార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో స్పెష‌ల్ పోలీసులు కూపీ లాగారు.

ఈ నేప‌ధ్యంలో ఓ లాడ్జిలో బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ బెట్టింగ్ ముఠాలోని మూడో వ్య‌క్తి పరారీలో ఉన్నాగ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో పోలీసుల తనిఖీలో వైభవ్ గుప్తా(రాజస్థాన్), ఆనంద్ కుమార్(కాచిగూడ) అరెస్ట్ అయ్యారు. అయితే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నరాజస్థాన్‌కు చెందిన క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్ ఆశిష్ ధన్ పరారీలో ఉన్నాడు.గురువారం లక్నో సూపర్ జెయింట్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ పై ఆన్ లైన్ , ఆఫ్ లైన్ మోడ్‌తో పాట వాట్సాప్ చాట్‌ల‌ ద్వారా బెట్టింగ్ కు పాల్పడ్డారు.

ఇక ఈ బెట్టింగ్ వ్య‌వ‌హారమంతా ప్రధాన క్రికెట్ బుకీ వికాష్ తొస్సవాడ డైరెక్షన్‌లో ఆశిష్ ధన్వార్ చేశాడని తెలుస్తోంది. సబ్ బూకీలు, పుంటర్ కలెక్షన్ల ఏజెంట్లతో బెట్టింగ్ నెట్ వర్క్‌ణు నెలకొల్పేందేేకే ధన్వార్ హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఈ క్ర‌మంలో ప్రధాన నిందితుడు ఆశిష్ ధన్వార్ సబ్ ఆర్గనైజర్ లకు క్రికెట్ బెట్టింగ్ యాప్ ఐడి, పాస్వర్డ్లు అందించేవాడని స‌మాచారం. క్రికెట్ బెట్టింగ్ మొత్తాన్ని 5శాతం కమిషన్ తో ప్రధాన బూకీ వికాస్ తొస్సవాడ‌కు పంపుతున్నట్లు పోలీసుల విచార‌ణ‌లో తెలిసింది. ఇక‌ పట్టుబడిన నిందితుల నుంచి మొత్తం 1,13,500 రూపాయ‌లు, 4 మొబైల్ ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.