Site icon HashtagU Telugu

Hyderabad Biryani: హైదరాబాదీ బిర్యానీ హ.. మజాకా

Eating Biryani is unhealthy to us

Eating Biryani is unhealthy to us

Hyderabad Biryani: హైదరాబాదీ బిర్యానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫెమాసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశీయులు సైతం హైదరాబాదీ బిర్యానీ అంటే పడిచస్తారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదీ బిర్యానీ రుచి మరెక్కడా లభించదంటే అతిశయోక్తి కాదు. ఇంత స్పెషాలిటీ ఉన్న హైదరాబాదీ బిర్యానీని నగర ప్రజలు లొట్టలేసుకుని లాగించేస్తారు. గత ఆరు నెలల్లో 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు చేశారని, గత 12 నెలల్లో 150 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు చేశారని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ శుక్రవారం వెల్లడించింది. 2022తో పోల్చితే గత ఐదున్నర నెలల్లో నగరంలో బిర్యానీ ఆర్డర్‌లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్‌లు జరిగాయి. జనవరి 2023 నుండి 15 జూన్ 2023 వరకు స్విగ్గీలో చేసిన ఆర్డర్‌ల విశ్లేషణ ఆధారంగా ఈ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

హైదరాబాద్‌లో 15,000 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లు తమ మెనూలలో బిర్యానీని అందజేస్తుండటంలో ఆశ్చర్యకరం. కూకట్‌పల్లి, మాదాపూర్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ & దిల్‌సుఖ్‌నగర్‌లలో అత్యధికంగా బిర్యానీ అందించే రెస్టారెంట్‌లు ఉన్నాయి.

Read More: Twitter Vs Government : “ట్వీట్ల తొలగింపు ఆర్డర్స్” కేసు ఓడిపోయిన ట్విట్టర్.. 50 లక్షల జరిమానా