Site icon HashtagU Telugu

Hyd Parks: ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ న్యూ లుక్

Hyd Parks

Hyd Parks

లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్ లుక్ ను మార్చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆ మేర‌కు ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్‌ను HMDA రూపొందిస్తోంది. కన్సల్టెంట్‌ల నుంచి కనీసం మూడు నుండి నాలుగు డ్రాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్‌స్కేప్ డిజైన్‌లు, 3D వీక్షణలు , ఇలస్ట్రేటివ్ స్కెచ్‌లు తీసుకోనుంది. ఇప్పటికే ఉన్న కొన్ని థీమ్‌లు కొత్త వాటితో న్యూ లుక్ తీసుకురానున్నారు. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్ల‌ను మ‌రింత ఆకర్షణీయంగా మార్చడానికి స‌న్న‌ద్ధం అవుతోంది.

కొన్ని న‌మూనాల‌ను తీసుకున్న త‌రువాత ఎంపిక‌చేసిన వాటి ప్ర‌కారం HMDA ఆ రెండు ప్రాంతాల‌ను మార్చ‌బోతుంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్‌ల ను ఆకర్షణీయంగా పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు పార్కులు ప్రసిద్ధ హ్యాంగ్‌అవుట్ స్పాట్‌లు. ఆ రెండు తెలంగాణ అమరవీరుల స్మారకం, కొత్త సచివాలయ భవనానికి సమీపంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

కొత్త డిజైన్ ప్లానింగ్ ప్రక్రియలో పచ్చిక బయళ్ళు, పూల పడకలు, చెట్లు, మొక్కలు మరియు పొదలు వంటి ల్యాండ్‌స్కేప్ భాగాలు, అలాగే పేవ్‌మెంట్, మార్గాలు, ట్రయల్స్, ఇప్పటికే ఉన్న నిర్మాణాలు, బహిరంగ వెలుతురు కోసం లైట్ పోల్స్, ప్రవేశ ద్వారాలు మరియు పార్కింగ్ వంటి ఉపరితల మార్పులు చేయాల‌ని భావిస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కొత్త పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. లుంబినీ పార్క్ ,ఎన్టీఆర్ గార్డెన్‌ల కోసం ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో సందర్శకుల సందర్శన పెరిగినందున, మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌లను నియమించుకుంటుంది.