Site icon HashtagU Telugu

Rape in Hyderabad : బెంజ్ కారులో మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం

rape

Rape

మెర్సిడ‌స్ బెంజ్ కారులో ఓ మైన‌ర్ బాలిక‌ను న‌లుగురు వ్య‌క్తులు కలిసి సామూహికంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అత్యాచారం చేసిన వాళ్ల‌లో ఒక ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడ‌ని పోలీసులు చెబుతున్నారు. సామూహిక అత్యాచారం చేసిన న‌లుగురు యువ‌కులు కూడా మైన‌ర్ లుగా గుర్తించారు. హైదరాబాద్‌లో జ‌రిగిన ఈ సామూహిక అత్యాచారం జ‌రిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందని, నేరంలో పాల్గొన్న నిందితులందరూ మైనర్లేనని పోలీసు వర్గాలు తెలిపాయి.జూన్ 1వ తేదీ బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి వాస్తవాలను ధృవీకరించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాస్త‌వంగా ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. తొలుత ఈ ఘటనలో పాల్గొన్న ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.17 ఏళ్ల బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు. పోలీసులు ఇప్పుడు కేసును మార్చుతూ IPC సెక్షన్ 376 (గ్యాంగ్ రేప్) జోడించారు.
ఒక ఎమ్మెల్యే కుమారుడు మరియు మైనారిటీ బోర్డు ఛైర్మన్ పార్టీలో ఉన్నారని, అమ్మాయితో కలిసి ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఒక‌రు చెప్పారు. బాధితురాలు మైనర్ అయినందున పేరు వెల్ల‌డించ‌డంలేదు. అత్యాచారంలో పాల్గొన్న నిందితుల పేర్ల‌ను కూడా పోలీసులు వెల్ల‌డించ‌డంలేదు. కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోంది.