Hyderabad Metro: నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో పరుగులు

హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి

Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేసినటట్టు మెట్రో రైల్ యాజమాన్యం తెలిపింది.

హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ మెట్రో రైలు (HMR) ప్రకటించింది. ఒంటిగంట వరకు అనుమతి ఇవ్వడంతో భద్రత ఏర్పాట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగబోవని స్పష్టం చేసింది మెట్రో. ఈ మేరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉంటుందని HMR పత్రికా ప్రకటనలో తెలిపింది.

సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్లలో ఉదయం 6:00 నుండి రాత్రి 11:00 వరకు నడుస్తాయి. అయితే నూతన సంవత్సరం రోజున ప్రజలు సంబరాలు చేసుకుంటారు. ఆ రోజు ఎక్కువగా బయట సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మెట్రో రైలుని అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన మెట్రో యాజమాన్యం జనవరి తెల్లవారుజాము వరకు మెట్రోని నడిపిస్తామని పేర్కొంది.

Also Read: Amla Benefits : చలికాలంలో ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?