Hyderabad Metro: జీతాలు పెంచండి మహాప్రభో!

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరించారు. దీంతో ఆయా మెట్రో స్టేషన్ లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.  5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని మెట్రో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 15 వేల నుండి 18 వేల రూపాయల వరకు సాలారీ పెంచాలని డిమాండ్ చేశారు. కాగా మెట్లో నిత్యం జర్నీ చేసే ఉద్యోగులు అమీర్ పెట్, మియాపూర్ మెట్రలో స్టేషన్ లలో టికెట్ల […]

Published By: HashtagU Telugu Desk
Metro1

Metro1

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరించారు. దీంతో ఆయా మెట్రో స్టేషన్ లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.  5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని మెట్రో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 15 వేల నుండి 18 వేల రూపాయల వరకు సాలారీ పెంచాలని డిమాండ్ చేశారు. కాగా మెట్లో నిత్యం జర్నీ చేసే ఉద్యోగులు అమీర్ పెట్, మియాపూర్ మెట్రలో స్టేషన్ లలో టికెట్ల కోసం క్యూ కట్టారు. దీంతో మెట్రో స్టేషన్స్ ప్రయాణికులతో నిండిపోయాయి. మొత్తం 150 మంది ఉద్యోగులు బైకాట్ చేసినట్టు తెలుస్తోంది.

  Last Updated: 04 Jan 2023, 01:31 PM IST