Site icon HashtagU Telugu

Hyderabad: రన్నింగ్ ట్రైన్ ఎక్కితే ఇలాగే జరుగుతుంది

Hyderabad

Hyderabad

Hyderabad: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి అదుపు తప్పి రైలు ప్లాట్‌ఫాం మధ్యలో పడిపోయాడు . సిబ్బంది గమనించి రైలును నిలిపివేశారు.ఈ ఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు ప్లాట్‌ఫారమ్‌ను పగులగొట్టి అందులో చిక్కుకున్న ప్రయాణికుడిని బయటకు తీశారు. దాదాపు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రాయచూరుకు చెందిన సతీష్‌గా గుర్తించారు.

రైల్వే ప్రమాదాలు తరుచూ జరుగుతున్నా ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ప్రమాద భారీన పడుతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. రైల్వే అధికారులు జాగ్రత్తలు చెప్తున్నా అవేం పట్టించుకోకుండా ప్రయాణికులు ప్రమాదాన్ని కానీ తెచ్చుకుంటున్నారు.

Also Read: Beauty Tips: పెదాలు కంటి చుట్టూ నలుపు సమస్య ఇబ్బంది పెడుతుందా.. అయితే వెంటనే ఇలా చేయండి?