హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది. బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. నాగరాజు అనే వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. హత్య వెనుక అతని భార్య కుటుంబీకుల హస్తం ఉందని నాగరాజు బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యకు నిరసనగా మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నాగరాజు రెండు నెలల క్రితం జనవరి 31న 23 ఏళ్ల సయ్యద్ అష్రిన్ సుల్తానా అలియాస్ పల్లవిని వివాహం చేసుకున్నాడు.
కాలేజ్ డేస్ నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని… రెండు నెలల క్రితం పాతబస్తీలోని ఆర్యసమాజ్ మందిరంలో వీరి వివాహం జరిగిందని నాగరాజు బంధువులు తెలిపారు. అబ్బాయి హిందువు కావడం, అమ్మాయి ముస్లిం కావడంతో ఆమె కుటుంబసభ్యులు నాగరాజు చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో నివాసముంటున్న బిల్లాపురం నాగరాజు(25) పాతబస్తీలోని మలక్‌పేటలోని ఓ ప్రముఖ కార్ షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. నాగరాజు చంపిన వ్యక్తులను అరెస్ట్ చేయాలంటు బీజేపీ నిరసనకు దిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://twitter.com/sowmith7/status/1521933216050864129