Site icon HashtagU Telugu

Leopard: సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం!

Leopard

Leopard

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో గురువారం రాత్రి చిరుత పులి కలకలం సృష్టించింది. పారిశ్రామికవాడలోని హెటెరో కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఆవరణలో చిరుత ను చూసి.. భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కంపెనీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీలో.. రోడ్డును పులి దాటి వెళ్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అది చిరుత పులేనా? లేకా వేరే ఏదైనా జంతువా? అనేది నిర్ధారించే ప్రయత్నం లో అటవీ అధికారులు ఉన్నారు. ఒకవేళ అది పులే అయితే.. పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించి పట్టేసి అడవిలో వదులుతామని చెబుతున్నారు.