Site icon HashtagU Telugu

Hyderabad: పచ్చదనంలో హైదరాబాద్‌ అగ్రస్థానం.. ఫలితాలిస్తున్న హరితహారం!

Hyderabad

Hyderabad

పచ్చదనంతో భాగ్యనగరం కళకళలాడుతోంది. హరితహరంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో దాదాపు 4.60కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందుకు రూ.298.09 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా-2021 నివేదిక ప్రకారం దేశంలో దశాబ్ద కాలంలో అత్యధిక గ్రీన్‌ కవర్‌ వృద్ధి చెందిన మెగా నగరాల్లోనూ హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సత్ఫలితాలిస్తోంది.

Exit mobile version