Hulchul : మద్యం, గంజాయి మత్తులో ఉన్నప్పుడు, కొందరు ఆందోళనకరమైన ప్రవర్తనను ప్రదర్శిస్తారు. ఈ పద్దతిలో కొంతమంది రోడ్డుపైన, పబ్లిక్ ప్లేస్‌లలో అల్లర్లను సృష్టించడం మనం చూస్తూనే ఉంటాం. ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో, మన వల్ల పక్కవాళ్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయో అన్న విషయం కూడా వారి మదిలో మెదలదు. ఇటీవల మత్తు పదార్థాలను సేవించే వారి సంఖ్య పెరిగిపోవడంతో, వీరికి సంబంధించిన వివాదాలు, సంఘటనలు కూడా ముమ్మరంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. తాజాగా హైదరాబాద్ పాతబస్తీ-చంపాపేట్ ప్రధాన రహదారిలో ఒక యువకుడు మద్యం మత్తులో హంగామా సృష్టించాడు.
Eturnagaram Encounter : ఏటూరునాగారం అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
ఓ యువకుడు గంజాయి మత్తులో ప్రవర్తిస్తూ, పోలీసులకు కూడా విఘాతం కలిగించాడు. అతను జనం మధ్య నడిరోడ్డుపై వాహనాలను అడ్డుకుంటూ, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. రోడ్డు మధ్య అతని ఉత్సాహం చూస్తుంటే, అతనికి భయం లేకుండా, ఏమీ వేరుగా భావించే పరిస్థితి కనిపించలేదు. కింద కూర్చొని, లేచి తిరుగుతూ, వాహనాలను అడ్డుకుంటూ ఆయన నానా వీరంగం సృష్టించాడు.
ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ అధికారులు కూడా క్రమంగా కనిపించకపోవడం గమనార్హం. ఎవరైనా అతనిని ఆపి, జాగ్రత్తలు తీసుకునే సూచన ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాంతో, జనం, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇబ్బందులు పడ్డారు. ఈ సన్నివేశంలో, గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి తుగుతూ.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. కాసేపటికి ట్రాఫిక్ సిబ్బంది వచ్చి సదరు వ్యక్తిని అదుపు చేసే ప్రయత్నం చేస్తే.. వారితో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. అయితే.. చివరికి తనను పక్కకు జరిపి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే.. ఇలాంటి ఘటనలు విశ్వ నగరం హైదరాబాద్ తరుచూ జరుగుతున్నా పోలీసులు మాత్రం ఈ సమస్యకు పరిష్కారం చూడలేకపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల సరఫరాను నివారించేందుకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. పలు చోట్లు తనిఖీలు చేస్తూ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. అయినప్పటికీ.. గంజాయి సరఫరా జోరుగా సాగుతోంది.
Bapu Ghat : బాపూఘాట్ వద్ద అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం, వీల్ ఆఫ్ లైఫ్