Site icon HashtagU Telugu

Hyderabad: పట్టుబడ్డ రూ.33.12 లక్షల విలువైన బంగారం

Hyderabad

Hyderabad

Hyderabad: కువైట్ నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తరలించేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 559 గ్రాముల బంగారు ఆభరణాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ యువకుడు హెయిర్ క్రీమ్‌లో బంగారాన్ని తీసుకొస్తున్నాడు. అందులో 2 బంగారు కడ్డీలు, 4 బంగారు గాజులు, 3 రంగురంగుల పూసల గొలుసులు, బంగారు ఉంగరాలు మరియు ఒక బ్రాస్‌లెట్‌ ఉన్నాయి. తనిఖీల్లో భాగంగా యువకుడిని తనిఖీ పెద్ద మొత్తంలో బంగారం వెలుగు చూసింది. ఈ మొత్తం విలువ రూ:33.12 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read: Diabetes: షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందాలి అనుకుంటున్నారా.. అయితే ఆవాలతో ఇలా చేయాల్సిందే?