బక్రీద్‌కు ఒకరోజు ముందు మేకలను దొంగిలించిన నలుగురిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలోని నూరీనగర్‌లో నివాసముంటున్న మహ్మద్ బషీర్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ముఠా అతని నలుగురు సహచరులు సయ్యద్ అమీర్, సయ్యద్ అజీజుల్లా హష్మీ, సయ్యద్ నదీముద్దీన్, మొహసిన్‌ఖాన్‌లతో కలిసి నూరీనగర్‌లోని ఓ ఇంట్లో 23 మేకలను చోరీకి పాల్పడ్డారు. బక్రీద్ కోసం ఐదుగురు సభ్యుల ముఠా మేకలను దొంగిలించి ఆటోలో తరలించారు. అనంతరం మహబూబ్‌నగర్‌లోని పెబ్బర్ ప్రాంతంలో వినియోగదారులకు మేకలను విక్రయించారు. పోలీసులు సీసీటీవీలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
Stealing Goats On Bakrid: బక్రీద్ కోసం మేకలను దొంగిలించారు!

Goates