Hyderabad: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో యువతీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
మెహ్రీన్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఈ రోజు జూన్ 14 శుక్రవారం నాడు యూసుఫ్‌గూడ, మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ఆమె బస్సు దిగుతుండగా టిఎస్‌ఆర్‌టిసి బస్సు చక్రాల కింద పడింది. రెప్పపాటులో బస్సు ఆమెపై నుంచి వెళ్ళింది. స్థానికులు కేకలు పెట్టడంతో బస్సు డ్రైవర్ తేరుకుని బస్సు ముందుకు ఆపాడు. అయితే అప్పటికే యువతీ మృతి చెందింది. విద్యార్థిని బస్సు చక్రాల కింద ఎలా జారి పడిందో ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
Also Read: Prabhas : ప్రభాస్‌తో ‘కన్నప్ప’ చేయాలని సీన్స్ రాసుకున్న కృష్ణంరాజు.. మోహన్ బాబు కామెంట్స్..