Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం

Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణలో మరో అవినీతి తిమింగలం వెలుగు చూసింది. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఓ ఇంజనీర్‌ పట్టుబడ్డారు. వ్యక్తి నుంచి 84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే..

మాసబ్ ట్యాంక్ లోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.జగజ్యోతి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్ నుంచి ఆమె రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. జగజ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. నిందితురాలు వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

Also Read: Hyderabad; హైదరాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్: అరెస్ట్