Hyderabad ECIL – Aditya L1 : ‘ఆదిత్య ఎల్‌-1’ ప్రయోగంలో హైదరాబాద్ ఈసీఐఎల్‌, మిధానీ పరికరాలు

Hyderabad ECIL - Aditya L1 :  సూర్యుడిపై రీసెర్చ్ కోసం ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది.

Published By: HashtagU Telugu Desk
Aditya L1 Mission

Aditya L1 Mission

Hyderabad ECIL – Aditya L1 :  సూర్యుడిపై రీసెర్చ్ కోసం ఇవాళ ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం కోసం మన హైదరాబాద్ కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), మిధాని వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కీలక పరికరాలను అందించాయి.  ఆదిత్య ఎల్‌ 1 స్పేస్ క్రాఫ్ట్ కు సంబంధించిన కమ్యూనికేషన్‌ వ్యవస్థల అభివృద్ధిలో ఏఎస్‌రావు నగర్‌లోని ఈసీఐఎల్‌, కంచన్‌బాగ్‌లోని  మిధాని భాగస్వామ్యాన్ని అందించాయి.

Also read : Today Horoscope : సెప్టెంబరు 2 శనివారం రాశి ఫలాలు.. వారు పనుల్ని వాయిదా వేసుకోవడం మంచిది

ఈ ప్రయోగం యొక్క కమ్యూనికేషన్ అవసరాలను తీర్చే రెండు గ్రౌండ్‌ యాంటెనా నెట్‌వర్క్‌లను ఈసీఐఎల్‌ సమకూర్చింది. వీటిలో 18 మీటర్ల యాంటెనా వ్యవస్థ బరువు దాదాపు 150 టన్నులు.ఇక 4.6 మీటర్ల షిప్‌ బోర్న్‌ యాంటెనా మరొకటి ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ లోపలి నుంచి కూడా ట్రాక్ చేయగలగడం షిప్ బోర్న్ యాంటెనా (Hyderabad ECIL – Aditya L1)   ప్రత్యేకత. ఇక అంతకుముందు చంద్రయాన్ -3 కోసం వాడిన 32 మీటర్ల డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటెనా కూడా ఈసీఐఎల్‌ తయారుచేసిందే. దాన్ని కూడా ఆదిత్య ఎల్‌1 ప్రయోగం ట్రాకింగ్‌ కోసం వాడుకోనున్నారు.  ఆదిత్య ఎల్‌1 ప్రయోగంలో మిధాని తయారు చేసిన ప్రత్యేక లోహాలను,  టైటానియం రింగ్‌లు, బార్‌లను ఉపయోగిస్తున్నారు.

  Last Updated: 02 Sep 2023, 08:34 AM IST