Site icon HashtagU Telugu

Big Ticket : అబుదాబి వీక్లీ డ్రాలో 22 లక్ష‌లు గెలుచుకున్న హైద‌రాబాద్ డ్రైవ‌ర్‌

Big Ticket

Big Ticket

బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో 100,000 దిర్హామ్ (రూ. 22,63,680) గ్రాండ్ ప్రైజ్‌ని ఓ డ్రైవ‌ర్ గెలుచుకున్నాడు. విజేత నరేష్ కుమార్.. 256వ నంబరు రాఫిల్ డ్రాలో 141484 నంబర్ టిక్కెట్‌ను కొనుగోలు చేసి బహుమతిని పొందాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కుమార్ గత 10 సంవత్సరాలుగా మస్కట్‌లో నివసిస్తున్నాడు. సహోద్యోగులు, స్నేహితులతో సహా పది మందితో కలిసి గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. తను గెలిచినట్లు తెలియగానే న‌రేష్ కుమార్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. న‌రేష్ కుమార్ స్వ‌స్థ‌లం హైద‌రాబాద్‌.. తాను జీవనోపాధి కోసం మ‌స్క‌ట్ వెళ్లాడు. అక్క‌డ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఈ డ్రాలో వ‌చ్చిన డ‌బ్బుల‌తో భారతదేశంలో తిరిగి వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్న‌ట్లు న‌రేష్‌కుమార్ తెలిపారు.