Site icon HashtagU Telugu

Hyderabad : ద‌క్క‌న్ మాల్‌ కూల్చివేత‌పై సందిగ్థ‌త‌.. ఐదు రోజులు గ‌డిచినా..?

fire accident

Resizeimagesize (1280 X 720) (4)

సికింద్రబాద్ ద‌క్క‌న్ మాల్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగి ఐదు రోజులు గ‌డిచిన ఇద్ద‌రి మృత‌దేహాలు ఇంకా ఆచూకీ దొర‌క‌లేదు. మృత‌దేహాలు ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో మాల్ కూల్చివేత‌పై సందిగ్థ‌త నెల‌కొంది.ప్ర‌స్తుతానికి స‌హాయ‌క చర్య‌లు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో దొరికి మృతుడి అవ‌శేషాల‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. మృతుడి డీఎన్ఏతో ముగ్గురు మృతుల కుటుంబీకుల డీఎన్ఏను అధికారులు పోల్చ‌నున్నారు. అయితే ఈ డీఎన్ఏ రిపోర్ట్ వ‌చ్చేంద‌కు క‌నీసం వారం రోజులు ప‌డుతుంద‌ని అధికారులు అంటున్నారు. మ‌రోవైపు హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాల పై అగ్నిమాపక అధికారులతో హోంమంత్రి మ‌హమ్ముద్ అలీ స‌మీక్ష నిర్వ‌హించారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో భవన నిర్మాణాలు చేపడుతున్నారని సమావేశంలో అధికారులు హోంమంత్రికి తెలిపారు.. ఈ నెల 25 న హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై సచివాలయంలో మంత్రులు, అధికారుల ప్రత్యేక స‌మావేశం నిర్వ‌హించున్న‌ట్లు అధికారులు తెలిపారు.