Site icon HashtagU Telugu

Mask Violation: మాస్క్ పెట్టుకోలేదా.. అయితే ఫైన్ కట్టాల్సిందే!

మాస్క్ నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేని వ్యక్తులపై చిక్కడపల్లి పోలీసులు సోమవారం సుమారు 100 కేసులు నమోదు చేశారు. కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా ‘మాస్క్ ఆన్’ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా పోలీసులు వివిధ ప్రదేశాలలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. హోటళ్లు, పాన్‌షాపులు, టీ స్టాళ్లు, బస్టాండ్‌లు తదితర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా దొరికిన వారిని పట్టుకుని జరిమానాలు విధించారు. దుకాణాల్లో ‘నో మాస్క్, నో ఎంట్రీ’ బోర్డులు పెట్టాలని, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని అధికారులు కోరారు. స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని పోలీసులు తెలిపారు.

Exit mobile version