Site icon HashtagU Telugu

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టు‌లో కారు బీభత్సం

Hyderabad

Hyderabad

Hyderabad: శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఆపివేసి క్రమంలో వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ కల్వర్టులోకి దూసుకెళ్లి నుజ్జు నుజ్జయ్యాయి ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు పల్టీలు కొట్టి కల్వర్టులో పడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రధాన విమానాశ్రయం రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read:Pranitha Subhas: గ్లామర్ ఫోటోస్ తో పిచ్చెక్కిస్తున్న ప్రణీత.. అందాల దేవత అంటూ?